ముప్పాల మండలంలోని బూత్ స్థాయి అధికారులు, సూపర్వైజర్లతో తహసీల్దార్ భవాని శంకర్ సమీక్ష సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. బూత్ స్థాయి అధికారులు ఓటర్ల జాబితాలో తప్పు ఒప్పులను గుర్తించాలని ఆదేశించారు. ఒకే డోరు నంబరు మీద 10 కంటే ఎక్కువ ఓట్లు ఉంటే, వాటిని సవరించాలని సూచించారు. ఎలక్షన్ సమయానికి అన్నీ అవకతవకలు గుర్తించి సవరించాలని సూచించారు.