పొన్నూరు పట్టణంలోని శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి దేవాలయం ఆస్తులను అన్యాక్రాంతం చేసేందుకు పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య యత్నిస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో రేపు గురువారం దేవస్థానం ప్రాంగణంలోని ఈవో కార్యాలయం ముట్టడి చేపట్టనున్నట్లు పొన్నూరు తెదేపా కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని భక్తులు, తెదేపా శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.