జగన్మోహన్ రెడ్డి తన అవసరాల కోసం వాడుకొని నట్టేట ముంచటం అలవాటుగా చేసేపనేనని అని మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. సీఐడీ చీఫ్లుగా నాడు సునీల్, నేడు సంజయ్‌లు జగన్ ఆడిన వికృత క్రీడలో బలైనారు అని అన్నారు. స్వప్రయోజనాల కోసం వాడుకున్నంత కాలం వాడుకుని ఇప్పుడు పక్కకు నెట్టేశారని మండిపడ్డారు. సీఎం ఒత్తడి వల్లే సంజయ్ మార్గదర్శిపై చట్ట విరుద్ధంగా వెళ్లి ఇబ్బందులు తెచ్చుకున్నారన్నారు. సీఐడీ చీఫ్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన పీఎస్ఆర్ ఆంజనేయులైనా సజ్జల, జగన్ చెప్పినట్లు చేయకుండా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటూ తన గౌరవం కాపాడుకోవాలని పీతల సుజాత హితవుపలికారు.