కేంద్ర ప్రభుత్వం స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్స్ (SDRF) కింద 22 రాష్ట్రాలకు భారీగా సహాయం అందించింది. రూ.7,532 కోట్ల నిధులను విడుదల చేయనున్నట్టు చెప్పింది. అత్యధికంగా మహారాష్ట్రకు 1420.8 కోట్ల నిధులు విడుదల కాగా, అత్యల్పంగా గోవాకు రూ.4.8 కోట్ల నిధులు విడుదల అయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌కు రూ.493.6 కోట్ల నిధులు విడుదల కాగా, తెలంగాణకు 188.8 కోట్ల నిధులు విడుదల చేయనున్నట్టు ప్రకటన జారీ చేసింది.