స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిసాయి. ఈ క్రమంలో ట్రేడింగ్ ముగిసే సరికి సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్లు నష్టపోయి 65,393 వద్ద ముగిసింది. నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 19,384 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : కోటక్ బ్యాంక్ (0.62%), ఏషియన్ పెయింట్స్ (0.48%), సన్ ఫార్మా (0.42%), నెస్లే ఇండియా (0.39%), టైటాన్ (0.31%).
టాప్ లూజర్స్ : ఇన్ఫోసిస్ (-1.17%), టాటా మోటార్స్ (-1.15%), అల్ట్రాటెక్ సిమెంట్ (-1.14%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.95%), ఎన్టీసీపీ (-0.95%).