ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలను సవరించేందుకు ప్రభుత్వం త్వరలో కొత్త పీఆర్సీ (12వ కమిటీ)ని తీసుకురానుంది. ఈ పే రివిజన్ కమిటీకి చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ మన్మోహన్ సింగ్ నియమితులయ్యారు. ఏడాదిలోగా వేతన సవరణపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీ త్వరలో ఉద్యోగులు, కార్మిక సంఘాలతో జీతభత్యాల విషయమై చర్చించనుంది.