ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లిగూడెంలో ఆయన మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ప్రజల డేటాను సేకరించి హైదరాబాద్ నానక్ రాంగూడలోని ఎఫ్ ఓఏ ఏజెన్సీకి అందజేసిందని తెలిపారు. 1000 మంది సిబ్బంది అక్కడ ఏం చేస్తున్నారని, డేటా భద్రతకు బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిన జగన్.. చెత్తపై పన్ను వేసే చెత్త సీఎం అని విమర్శించారు.