తిరుపతి జిల్లా భారతీయ యాదవ మహాసభ అధ్యక్షుడిగా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలానికి చెందిన నాగార్జున యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకంతో పదవి ఇచ్చినందుకు యాదవ కులానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని నాగార్జున యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.