ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయ దళాల (ఎస్డీఆర్ఎఫ్) నిధులను బుధవారం విడుదల చేసింది. మొత్తం రూ.7,532 కోట్ల నిధులను విడుదల చేయగా ఆంధ్రప్రదేశ్‌కు రూ.493.6 కోట్లు, తెలంగాణకు రూ.188.8 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, సహజ విపత్తులు సంభవిస్తున్న నేపథ్యంలో తక్షణమే నిధులు అందించింది.