తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. ఘాట్ రోడ్డులోని 56వ మలుపు వద్ద నేడు చిరుత కనిపించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు చిరుతను దారి మళ్లించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వాహనదారులను గుంపులుగా వెళ్లమని సూచిస్తున్నారు. కాగా, ఇటీవల అలిపిరి నడకదారిలో చిరుత ఓ బాలుడిపై దాడి చేసిన విషయం తెలిసిందే. మరోసారి చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.