వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అలాగే విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్, టీడీపీలో చేరారు. అనంతరం ఆగస్ట్ 2020లో టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఇక ప్రస్తుతం వైసీపీకి కూడా రాజీనామా చేశారు.