ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెట్ (ఈఈఎ్‌సఎల్) సంస్థ దక్షిణ ప్రాంత సీనియర్ సలహాదారుగా ఎ.చంద్రశేఖరరెడ్డి నియమితులయ్యారు. ఈ ఏడాది మే 31న ఏపీ ట్రాన్స్‌కో నుంచి చంద్రశేఖరరెడ్డి రిటైర్ అయ్యారు. విద్యుత్తు పొదుపులో వినూత్న సాంకేతిక విధానాలు పాటించే ఈఈఎ్సల్ గతంలో ఏపీఎ్సఈసీఎం సీఈవోగా చంద్రశేఖర రెడ్డి చేసిన సేవలను గుర్తించి తమ సంస్థలో ప్రధాన సలహాదారుగా నిమించింది. చంద్రశేఖర్‌కు రాష్ట్రంలో ఎస్ఈసీఎం ద్వారా రైతులకు ఉచితంగా బోరువెల్స్, మోటార్లకు సోలార్ విద్యుత్తు, విద్యుత్తు పొదుపుపై అవగాహన, ఎల్ఈడీ బల్బులు, పంచాయతీలలో ఎల్ఈడీ వీధి దీపాలు వంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన అనుభవం ఉంది.