విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌పై కోడికత్తితో జరిగిన హత్యాయత్నం కేసుపై విజయవాడ ఎన్‌ఐఏ కోర్టులో వాదనలు ముగిశాయి. ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది విశాల్ గౌతమ్, నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు తరఫు న్యాయవాది అబ్దుల్ సలీం బుధవారం వాదనలు వినిపించారు. ముందుగా జగన్ తరఫు న్యాయవాది ఇనకొల్లు వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. ఈ వాదనలు ఇన్ కెమెరా విధానంలో సాగాయి. కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని, తమపై ఎలాంటి ఒత్తిడీ లేదని ఎన్‌ఐఏ తరఫు న్యాయవాది వాదించారు. న్యాయమూర్తి సత్యానంద్ తీర్పును ఈ నెల 25వ తేదీకి వాయిదా వేశారు.