ప్రస్తుతం టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. కాగా, టమాటా ధరలు భార్యభర్తల మధ్య చిచ్చుపెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. సంజీవ్ అనే వ్యక్తి భార్యను అడగకుండా కూరలో 2 టమాటాలు వేశాడు. దీంతో ధరలు అంతలా ఉన్నప్పుడు వాడటం అవసరమా అంటూ భార్య మండిపడింది. అనంతరం కూతురిని తీసుకొని ఇంటి నుండి వెళ్లిపోయింది. ఎంత వెతికినా దొరకకపోవడంతో సంజీవ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.