సీఎం జగన్ పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మరోమారు విరుచుకుపడ్డారు. నేడు అయన మీడియాతో మాట్లాడుతూ.. పేదలకు భూములపై హక్కులు కల్పించే నెపంతో తన పార్టీ భూకబ్జా ముఠాలకు న్యాయం చేయడమే ముఖ్యమంత్రి లక్ష్యమని వ్యాఖ్యలు చేశారు. పేదల ముసుగులో తన స్వలాభంతో పాటు, తన పార్టీ వారు కబ్జా చేసిన భూములను వారిపరం చేయడానికే చట్ట సవరణ (భూముల బదలాయింపు నిరోధకచట్టం-1977) అంటున్నారన్నారు.