రోడ్లు మౌలిక సదుపాయాలు పెంపు వల్ల పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు మరింతగా రాబోతున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. కడప రేణిగుంట హైవేను అక్టోబర్ 2024 పూర్తి చేస్తామన్నారు. మదనపల్లి హైవేను జనవరి 2025 పూర్తి చేస్తామని చెప్పారు. నెల్లూరు కృష్ణపట్నం పోర్టు హై వేను త్వరలో ప్రారంభిస్తున్నామన్నారు. పీలేరులో జరుగుతున్న హైవే పనులను జనవరి 2025కి పూర్తి చేస్తామన్నారు. అలాగే ఏర్పేడు హైవే పనులను నవంబర్ 2024లోపు పూర్తి చేస్తామన్నారు. తిరుపతిలో ఇంటర్ మోడల్ బస్ స్టేషన్‌ను హైవే అథారిటీ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తామని... ఆ పనులకు త్వరలో ఒప్పందాలు పూర్తి అవుతాయన్నారు. బెంగళూరు టు చెన్నై ఇప్పుడు ఆరు గంటలు పడుతోందని.. హైవే పూర్తి అయితే రెండు గంటల్లో ప్రయాణం పూర్తవుతుందన్నారు. వైష్ణోదేవి ఆలయానికి వెళ్లడానికి ఢిల్లీ నుంచి హైవేని ఏర్పాటు చేస్తున్నామని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.