కర్నూలు జిల్లా, పెద్దకడుబూరుకు చెందిన వైసీపీ నేత రఘురాం, టీడీపీ నేత కురువ మల్లికార్జున మధ్య గత కొంత కాలంగా ఆధిపత్యపోరు నడుస్తోంది. అందులో భాగంగా వైసీపీ నేత రఘురాం మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బాలనాగిరెడ్డే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తారని చెప్పారు. దీనిపై రూ. 2 కోట్లు పందెం కడతానన్నారు. ఎవరైనా ధైర్యముంటే ముందుకు రావాలని సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన టీడీపీ నేత మల్లికార్జున... రఘురాం సవాల్‌ను స్వీకరించారు. బాలనాగిరెడ్డి గెలవరని, టీడీపీ ఇన్చార్జ్ తిక్కారెడ్డి గెలుస్తారని, రూ. 2కోట్లు పందెం కడతానని సవాల్ చేశారు. దీంతో పోలీసులు టీడీపీ, వైసీపీ నేతలకు నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధం చేశారు.