దేశ రాజధాని ఢిల్లీని వరదలు ముంచెత్తడంతో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా విమర్శించారు. కొంత మంది అధునాతన భవనాల్లో కూర్చొని బాధ్యత నుంచి తప్పించుకుంటున్నారని ధ్వజమెత్తారు. గత తొమ్మిదేళ్లలో కేజ్రీవాల్ ఏ అంశానికి బాధ్యత తీసుకోవడం తాము చూడలేదని ధ్వజమెత్తారు. ఆయన ఎప్పుడు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.