LGBTQ కమ్యూనిటీ (లెస్బియన్, గే)పై ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహిస్తే మానవ తరం అంతమవుతుందని అన్నారు. దీనిని పాశ్చాత్య దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగాండా పర్యటన సందర్భంగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. "తీవ్రమైన స్వలింగసంపర్కం"లో నిమగ్నమైతే మరణశిక్ష విధించవచ్చని పేర్కొంటూ ఉగాండా ఒక చట్టాన్ని ఆమోదించింది.