ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం ద్వారా పౌరసేవలన్నీ వేగవంతంగా అందుతాయని ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం ఉరవకొండ సచివాలయం-1 పరిధిలో నిర్వహించిన ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నరసింహయ్య, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రమణ, సర్పంచ్ లలిత హాజరై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.