అనంతపురం జిల్లాలో దివ్యాంగుల పునరావస కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ యం. గౌతమి తెలిపారు. గురువారం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా వికలాంగుల పునరావస కేంద్రం ఏర్పాటుపై డిడిఆర్ సి మేనేజ్ మెంట్ టీంతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సమావేశంలో డిఆర్ డిఎ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహారెడ్డి, ఐసిడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.