అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని నమ్మబలికి ఓట్లు దండుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు వారిపట్ల నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నాడని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షుడు నారయణ స్వామి విమర్శించారు. ఈ మేరకు గురువారం అనంతపురంలోని కామ్రేడ్ నీలం రాజశేఖర రెడ్డి భవన్ లో అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించారు.