జూన్ నెల జీతాలు మంజూరు చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షురాలు కళ్యాణి డిమాండ్ చేశారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పదోన్నతుల మరియు బదిలీల ద్వారా కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ ఉన్న కారణంగా ప్రధానోపాధ్యాయులు పోస్టులు రద్దు కావడం వలన జీతాల సమస్య ఏర్పడింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రి స్వామి, చంద్రబాబు, రాజేంద్ర ప్రసాద్ లు పాల్గొన్నారు.