ఉపాధి హామీ కూలీలకు మౌలిక వసతులు కల్పించి, కూలీలకురావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని, ఉపాధి హామీకి నిధులు పెంచాలని సిపిఐ పార్టీ ఉరవకొండ తాలూకా కార్యదర్శి మల్లికార్జున పేర్కొన్నారు. గురువారం విడపనకల్ మండల పరిధిలోని ఉండబండ గ్రామంలో ఉపాధి కూలీలు వద్దకు వెళ్లి వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రిలో వ్యవసాయ కార్మిక సంఘం 23వ మహాసభ లను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.