జమ్మలమడుగు కన్యతీర్థం క్షేత్రంలో వెలసిన శ్రీ బాలాత్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఆషాడ బహుళ చివరి శుక్రవారం సందర్భంగా విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేశారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ, ప్రసాదాలను అందజేశారు.