ఇస్రో చంద్రునిపై పరిశోధనల కోసం ప్రతిష్టాత్మక చంద్రయాన్ -3 ప్రయోగాన్ని నేడు చేపట్టనుంది. నేడు మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుండి LVM-3 M4 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగంతో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండిగ్ సాధించే నాలుగో దేశంగా భారత్ నిలవనుంది. దక్షిణ ధృవం వద్ద దిగితే ఆ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలవనుంది. కాగా, చంద్రయాన్-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైన విషయం తెలిసిందే.