ఈ నెల 20 నుండి జిల్లాలో నిర్వహించే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి అధికారులంతా తమ శాఖలకు అప్పగించిన ఏర్పాట్లను ఈనెల 19 నాటికే పూర్తి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. రోజుకు కనీసం వెయ్యి మంది అభ్యర్ధులు హాజరు అయ్యే అవకాశం ఉందని, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ర్యాలీ విజయవంతం చేయాలని అన్ని శాఖల అధికారులకు సూచించారు. ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, జిల్లా ఎస్. పి దీపికా పాటిల్ పాల్గొన్నారు.