ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని కారుమంచి సచి వాలయంలో శుక్రవారం జగనన్న సురక్ష కార్య క్రమం నిర్వహిస్తున్నట్లు స్ధానిక ఎంపీడీఓ రత్నజ్యోతి తెలిపారు. వలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి 11 రకాల ధ్రువపత్రాలు ఉచితంగా అందించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అమె కోరారు.