ప్రధాని మోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్న ప్రధానికి ఆ దేశ అత్యున్నత పురస్కారం లభించింది. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోడీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లిజియన్ ఆఫ్ హానర్’ను అందించారు. ఎలిసీ ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన విందులోఈ పురస్కారాన్ని అందించారు. ఓ దేశ ప్రధానికి ఈ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. ఫ్రాన్స్ మిలిటరీ, పౌర పురస్కారాల్లో ఇదే అత్యుత్తమైనది.