అన్ని ప్రభుత్వ పథకాల అమల్లో చీరాల మండలం వెనుకబడి ఉందని జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా అసంతృప్తి వ్యక్తం చేశారు. వివిధ పథకాల అమలుపై ఆయన గురువారం సమీక్ష జరిపిన సందర్భంగా బడి మానేసిన పిల్లలు చీరాల మండలంలో 250 మంది ఉంటే విద్యాశాఖ అధికారులు ఏం చేశారని నిలదీశారు. అలాగే చీరాల మండలంలో జగనన్న కాలనీల నిర్మాణంలోనూ పురోగతి లేదని కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు తమ పనితీరు మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.