పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రప్రభుత్వం తాజాగా వెల్లడించింది. ఈ భేటీల్లో మొత్తం 27 బిల్లులు చట్టసభల ముందుకు రానున్నాయి. వీటిలో 21 కొత్తవి కాగా.. మిగిలిన ఆరు బిల్లులు. ఈ బిల్లులను ఇప్పటికే ప్రవేశపెట్టి స్థాయీ సంఘాలకు ప్రతిపాదించాయి. అయితే ఈ జాబితాలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు కనిపించలేకపోవడం గమనార్హం.