ఉరవకొండ గ్రామీణ సీఐ శేఖర్ ను పత్రిక విలేకరులు, దళిత నాయకులు పూలమాలలు వేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. గత పది రోజుల క్రితం విడపనకల్లు మండలం పాల్తూరు గ్రామంలో ఓ పత్రిక విలేకరిపై దాడి చేసిన వ్యక్తిపై త్వరగా చర్యలు తీసుకోవడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన అరగంటలో నిందితుడిని గాలించి అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు రిమాండ్ కు పంపారు. ఈ సందర్భంగా సదరు విలేకరి సీఐకు ధన్యవాదాలు తెలిపారు.