ఫ్రాన్స్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం పారిస్‌లో జరిగిన ఫ్రెంచ్ జాతీయ దినోత్సవ వేడుకల్లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి గౌరవ అతిథిగా పాల్గొన్నారు. బాస్టిల్ డే పరేడ్ ఈ వేడుకల్లో హైలైట్‌గా నిలుస్తుంది. 269 మందితో కూడిన భారత త్రివిధ దళాల బృందం పరేడ్‌లో పాల్గొంటుంది. ఫ్రెంచ్ జెట్లతో పాటు భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్ యుద్ధ విమానాలు కూడా ఫ్లైపాస్ట్‌లో చేరనున్నాయి.