చంద్రబాబు నాయుడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కళ్యాణ్‌కు తెలుసు అని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. చంద్రబాబు పూనిన చంద్రముఖిలా పవన్ పిచ్చిగంతులేస్తున్నాడంటూ మంత్రి ధ్వజమెత్తారు. ‘పవన్ కళ్యాణ్ ఓ పనికిమాలినవాడు. కోవిడ్ సమయంలో బాబు, పవన్ హైదరాబాద్‌లో దాక్కున్నారు. మీకు చప్పట్టు కొట్టేవారికి కోవిడ్ సమయంలో సేవలందించి వలంటీర్లే. బాబు సమయంలో జన్మభూమి కమిటీల పేరుతో మోసం జరిగితే నీ నోరెందుకు లేవలేదు పవన్. పవన్‌కు చట్టాల గురించి తెలియదు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడమే పవన్ కు తెలుసు. ఎవరూ బాగుండకూడదు... అందరూ కష్టాల్లో ఉండాలని పవన్ అనుకుంటున్నాడా?, ఎంతసేపూ మా అమ్మను అన్నారు...నా పెళ్లాన్ని అన్నారు...నా పిల్లలను తిట్టారని ఏడుపే కనబడుతోందంటూ రోజా విమర్శించారు.