మిస్టర్ గాలి కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థపై నీకున్న అభ్యంతరం ఏంటని మంత్రి అంబటి రాంబాబు సూటిగా ప్రశ్నించారు. పవన్ చిత్ర విచిత్ర స్వభావాలు కలిగిన వ్యక్తి అని.. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పీఆర్పీలో ఉన్నప్పుడే వైయస్ రాజశేఖరరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసి మూల్యం చెల్లించుకున్నారని గుర్తు చేశారు. అప్పుడే పవన్ రాజకీయాలకు పనికి రాడని ప్రజలు అనుకున్నారని తెలిపారు. మాటపై నిలవలేని వ్యక్తితం పవన్‌ది అంటూ మండిపడ్డారు. అసభ్యపదజాలం వాడిన నువ్వు సంస్కారం గురించి మాట్లాడతావా? అంటూ ధ్వజమెత్తారు. సంస్కారం గురించి పవన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాపులను రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.