ఏపీలో ఇసుక తవ్వకాలపై నిషేధం విధిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో అడ్డగోలుగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలను నిషేధించాలంటూ ఎన్జీటి ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. గత మార్చి 23న ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ విధించిన నిషేధాన్ని తొలగించాలని ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం ఎన్జీటి తీర్పుపై స్టే ఇవ్వడానికి నిరాకరించింది.