2012 నుంచి తన రాజకీయ ఎదుగుదలను లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలు చేస్తూనే ఉన్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. అసత్య ఆరోపణలకు ఇక చెక్ పెట్టాలనే పరువునష్టం దావాలు వేస్తున్నట్లు తెలిపారు. చేసిన అసత్య ఆరోపణలు వెనక్కి తీసుకోమని హెచ్చరించినా పొత్తుల సునీత వినలేదు కాబట్టే రూ.50 కోట్లకు పరువునష్టం దావా వేశానన్నారు. తోబుట్టువులు లేని తనకు, మా పిన్నమ్మ కూతుళ్లనే సొంత సోదరీమణులుగా చూసుకున్నానన్నారు. అలాంటి తనపై గుర్రంపాటి దేవేందర్‌రెడ్డి తప్పులు పోస్టు పెట్టినందుకు రూ.50కోట్లకు పరువు నష్టం దావా వేశానన్నారు. ఏనాడూ తప్పు చేయలేదు కాబట్టే తమపై చేసిన ఆరోపణల్ని ఒక్కటీ నిరూపించ లేకపోయారన్నారు. జగన్ రెడ్డిపై తాము ఆధారాలతో ఆరోపణలు చేశాం కాబట్టే జైలుకెళ్లటంతో పాటు అక్రమ ఆస్తుల జప్తు జరిగిందని టీడీపీ నేత తెలిపారు.