ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, తణుకులో వారాహి విజయయాత్రలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .... జగన్ కొంపలంటీస్తాడు. నేను గుండెలంటిస్తాను. భవన నిర్మాణ కార్మికులకు వచ్చే సెస్సును తినేసి వారికి అన్యాయం చేశాడు. సగటు మనిషి కష్టాలు నాకు తెలుసు. జగన్ బటన్ నొక్కాడు. నేను జగన్ నొక్కని బటన్లు చెబుతాను. చెత్త మీద గతంలో పన్ను లేదు. నువ్వు పన్ను వేశావు జగన్. నిత్యావసర వస్తువుల రేట్లను ప్రస్తావించిన పవన్.. 60 రూపాయల మద్యాన్ని 160 రూపాయలకు పెంచి మద్యపాన ప్రియుల పొట్టను కొట్టావు. వారి గుండెలు పిండేసావు. రేట్లు పెంచావు కాబట్టే, జనాలకు మొహం చూపించలేక పరదాలు కట్టుకుని తిరుగుతున్నావ్. తణుకు టీడీఆర్ స్కాంలో రూ. 309 కోట్లు డబ్బు కాజేశారు అని పవన్ కల్యాణ్ ఆరోపించారు.