నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో మహాశక్తి చైతన్య రథయాత్ర కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. అమ్మకు వందనం కార్యక్రమం ద్వారా ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో మొదటిసారి దీపం పధకం కింద మహిళలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. మహిళల రక్షణ కోసం అనేక పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చెప్పుకొచ్చారు. నాలుగేళ్లుగా ఉన్మాది పాలన సాగుతోందని విమర్శించారు. ఆడబిడ్డలు ఎవరికి రక్షణ లేదన్నారు. ఏ సైకో వస్తాడో ఏం చేస్తాడో తెలియని పరిస్థితి అని అన్నారు. టీడీపీ ఉంటే ఆడబిడ్డల పట్ల కన్నెత్తి చూడలేని పరిస్థితి ఉండేదని తెలిపారు. ఇంట్లో పడుకున్నా కంటి నిండా నిద్రపోలేని పరిస్థితి ఉందన్నారు. ఎప్పుడు ఎవరు వచ్చి యాసిడ్ పోస్తారో తెలియదని.. రేపల్లెలో దారుణం జరిగితే దద్దమ్మ సీఎం ఎందుకు వెళ్ళలేదని ఆయన ప్రశ్నించారు.