భవిష్యత్‌కు గ్యారంటీ బస్సు యాత్ర శనివారం ఉదయం ఘంటసాల మండలం శ్రీకాకుళంలో ప్రారంభమై ఘంటసాల, చల్లపల్లి, మోపిదేవి, అవనిగడ్డ మండ లాల మీదుగా కోడూరు చేరుతుందని అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తామని, విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి వెంకట్రామ్ పిలుపు నిచ్చారు. రాష్ట్ర, జిల్లా సీనియర్ నాయకులు పాల్గొంటారని తెలిపారు. గురువారం పార్టీ మండల అధ్య క్షుడు బండే శ్రీనివాసరావు అధ్యక్ష తన పార్టీ మండల సమావేశాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యమని, నియోజకవర్గంలోని రహ దారులు, కోడూరు మండల దిగువ ప్రాంతంలో బీడు బారిన నాలుగు వేల ఎకరాల భూములే అందుకు నిదర్శనమని ముఖ్య అతిథిగా విచ్చేసిన మండలి వెంకట్రామ్ విమర్శించారు.