నిత్యావసరాల ధరలు సామాన్యులకి షాకిస్తున్నాయి. పప్పుల ధరలు గత ఫిబ్రవరి నుండి ఇప్పటివరకు క్వింటాకు రూ. 1200 మేర పెరిగాయి. రిటైల్ మార్కెట్లో పప్పుల ధరలు కేజీకి రూ. 10 నుండి 15 వరకు పెరిగాయి. కాగా, నిత్యావసరాల ధరలు తగ్గేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికీ, ధరలు మాత్రం తగ్గడం లేదు. ధర పెరుగుదలో ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి చేరింది.