విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామివారి దేవస్థానంలోని ఐదుగురు అర్చకులకు దేవస్థానం ఈవో కిషోర్‌కుమార్ శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆలయ ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గపతిరాజు ఇటీవల నెల్లిమర్ల వచ్చినప్పుడు దేవస్థానానికి చెందిన ఇద్దరు అర్చకులు ఆయన్ను కలిశారు. బస్సు యాత్ర వద్ద పూజలు చేశారని, ఇది నిబంధనలకు విరుద్ధమని, అందుకే ఐదుగురు అర్చకులకు నోటీసులు జారీ చేశామని ఈవో తెలిపారు.