ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల హుండీ ఆదాయం తెలిపిన శ్రీశైలం ఆలయ అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 15, 2023, 12:44 PM

 శ్రీశైల మహా క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. ఈ హుండీ లెక్కింపులో రూ.3,75,21,688 నగదు లభించింది. అలాగే 350.5 గ్రాముల బంగారు, 6.280 కిలోల వెండి లభించాయి. 2,321 యూఎ్‌సఏ డాలర్లు, 4 సింగపూర్‌ డాలర్లు, 20 యూఏఈ దిర్హామ్స్‌, 100 ఆస్ర్టేలియా డాలర్లు, 28 మలేషియా రింగిట్స్‌ కూడా లభించాయి. ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 28 రోజులలో సమర్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com