తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వశాఖ, కేంద్ర సాహిత్య అకాడమీ సం యుక్త ఆధ్వర్యంలో మూడురోజులపాటు నిర్వహించిన జాతీయ సం స్కృత సమ్మేళనం శుక్రవారం ముగిసింది. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ.... ప్రపంచంలోని పురాతన భాషల్లో సంస్కృతం ఒకటని తెలిపారు. తొలుత వర్సిటీలో ఏర్పాటు చేసిన విజ్ఞాన, పుస్తక, వస్తు ప్రదర్శిని, పాండులిపి, తాళపత్ర గ్రంథాల ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. అనంతరం వర్సిటీ ఇండోర్ ఆడిటోరియంలో నిర్వహించిన ముగింపు సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్‌ఎ్‌సయూ, మైసూర్‌కు చెందిన సంస్కృతి ఫౌండేషన్ సహకారంతో జాతీయ సంస్కృత సదస్సును తిరుపతి వేదికగా నిర్వహించిన సాంస్కృతిక మంత్రిత్వశాఖ, సాహి త్య అకాడమీ ప్రతినిధులను అభినందించారు.