కట్నం ఇవ్వలేదని ఓ వరుడు పెళ్లైన రెండు గంటలకే వధువుకు విడాకులు ఇచ్చాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. ఫతేహాబాద్ రోడ్‌లోని ఓ మ్యారేజ్ హాల్లో ఇద్దరు సోదరీమణులు డాలీ, గౌరీల వివాహం ఒకే రోజు జరిగింది. ఇందులో డాలీ వివాహం ఆసిఫ్‌తో జరిగింది. అయితే పెళ్లి తర్వాత ఆసిఫ్, అతని కుటుంబసభ్యులు కట్నంగా కారును డిమాండ్ చేశారు. ఆ సమయంలో నవ వధువుకు ట్రిపుల్ తలాక్ చెప్పి వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.