పవన్ కళ్యాణ్ కు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ జబ్బు వచ్చిందని, అందుకే రకరకాలుగా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు. 375 సార్లు జగన్ పేరును ప్రస్తావించారని.. వెయ్యిసార్లు జగన్ పేరు ఉచ్చరిస్తే పవన్ పాపాల్లో కొన్ని అయినా కొట్టుకుపోతాయని విమర్శించారు. అనేక పెళ్లిళ్లు చేసుకునే వ్యక్తి హిందూమతాన్ని ఉద్ధరిస్తాడంట.. అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ టూర్లను ప్రజలు పట్టించుకోరన్నారు.