అభివృద్ధి-సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని ఉత్తర నియోజకవర్గం సమన్వయ కర్త కెకె రాజు అన్నారు. శుక్రవారం రాత్రి 26వార్డు శంకువానిపాలెం ప్రాంతంలో గడప గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో బాగంగా ఆయా ప్రాంతల్లో వార్డు ఇంచార్జ్ పీలా వెంకటలక్ష్మీ తో కలిసి పర్యటించారు. స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళులా ముందుకుసాగుతున్నామన్నారు.