విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటిస్తూ భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని వాల్తేర్ డీఆర్ఎం అనూప్సత్పథీ అన్నారు. 'రుతుపవనాల తరుణంలో జాగ్రత్తలు, వర్క్ సైట్ ప్రొటెక్షన్' అనే అంశంపై విజయనగరంలో శుక్రవారం నిర్వహించిన సదస్సు - ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. వర్షాకాలంలో ఎదురయ్యే పరిస్థితులపై ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బందికి అవగాహన సదస్సును నిర్వహించినట్లు తెలిపారు.