ఏపీలో విచ్చలవిడిగా గంజాయి లభ్యమవుతుందని టీడీపీ నేత లోకేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేశారు. మాదక ద్రవ్యాల సరఫరాలో ఏపీ అగ్రస్థానంలో ఉందని డీఆర్ఐ నివేదికలు చెబుతున్నాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా గంజాయి ఎక్కడ దొరికినా, ఆ మూలాలు ఏపీకి ముడిపడి ఉంటున్నాయని, రాష్ట్రం డ్రగ్స్ కేంద్రంలా మారిందని తెలిపారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు.