బెంగళూరు మెట్రో ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ‘మెట్రో మిత్రా’ యాప్ ఆధారిత ఆటోరిక్షా సదుపాయాన్ని ఆరంభించబోతోంది. ఆటో-మెట్రో స్టేషన్ల ఆరంభం నుంచి ఆఖరివరకు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. దీంతో మెట్రో దిగిన తక్షణమే వేరే ఆటో కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. తొలి 2 కి.మీ.లకు రూ.30, ఆ తరువాత ప్రతి కి.మీ.కు రూ.15తో పాటుగా రూ.10 అదనపు చార్జీ ఫిక్స్ చేశారు.